భారతదేశం, అక్టోబర్ 1 -- OTT Thriller: డిఫరెంట్ జోనర్ సినిమాలు, సిరీస్ లతో ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్న పాపులర్ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్‌ మరో కొత్త సిరీస్ ను తీసుకొస్తుంది. సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ గా తెరకెక్కిన 'వరం' ఓటీటీ స్ట్రీమింగ్ ను జియోహాట్‌స్టార్‌ ప్రకటించేసింది.

సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో రెడీ అయిన వరం వెబ్ సిరీస్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 9 నెలల క్రితమే ఈ సిరీస్ టీజర్ ను రిలీజ్ చేశారు. అప్పుడే కమింగ్ సూన్ అని అనౌన్స్ చేశారు. కానీ ఇన్ని రోజులకు స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించారు.

వరం సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్ ఇదే నెలలో జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 22 నుంచి ఈ సిరీస్ ఓటీటీలో అందుబాటులో ఉంటుందని జియోహాట్‌స్టార్‌ ఇవాళ (అక్టోబర్ 1) అఫీషి...