భారతదేశం, జూలై 31 -- Rao Bahadur OTT Thriller: టాలీవుడ్ నుంచి వచ్చే వైవిధ్యమైన, హై-కాన్సెప్ట్ సినిమాలకు అంతర్జాతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మంచి ఆదరణ లభిస్తోంది. సరికొత్త కథాంశాలతో వచ్చే చిత్రాలను డిజిటల్ వీక్షకులు ఆదరిస్తున్న నేపథ్యంలో, మరో క్రేజీ ప్రయోగం ఓటీటీ ప్రేమికులను అలరించేందుకు సిద్ధమైంది. 'తెలుగు సినిమాను ఇదివరకు చూడని రీతిలో అనుభవించండి' అనే ఆసక్తికరమైన ప్రచారంతో వచ్చిన 'రావు బహదూర్' (Rao Bahadur) మూవీ ఓటీటీలో అడుగుపెట్టింది.

లేటెస్ట్ తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ 'రావు బహదూర్' ఇవాళ (జూలై 31) ఓటీటీలోకి వచ్చేసింది. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'నెట్‌ఫ్లిక్స్' (Netflix)లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. పాన్-ఇండియా రేంజ్‌లో అత్యధిక వీక్షకులను చేరుకునేలా ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి తెచ్చారు....