భారతదేశం, జూన్ 2 -- OTT Thriller: మలయాళ సినిమా రంగంలో విలక్షణ నటనతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో షేన్ నిగమ్. ఆయన లీడ్ రోల్‌లో నటించిన తాజా ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'దృఢం' ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. థియేటర్లలో విడుదలైన కొన్ని వారాలకే ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలకు ముస్తాబైంది.

మే 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ ఉత్కంఠభరిత చిత్రం దృఢం మంచి టాక్ దక్కించుకుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలో అడుగుపెట్టనుంది. ఈ నెల జూన్ 12 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియోహాట్‌స్టార్' (JioHotstar) లో స్ట్రీమింగ్ కానుంది.

మలయాళ క్రైమ్ థ్రిల్లర్ దృఢం తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చ...