భారతదేశం, మే 13 -- OTT Thriller: కోలీవుడ్ విలక్షణ నటుడు ఆర్య ప్రధాన పాత్రలో నటించిన హై-వోల్టేజ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'మిస్టర్ ఎక్స్' (Mr. X) ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, మేకింగ్ వ్యాల్యూస్ బాగున్నప్పటికీ, కమర్షియల్‌గా మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు పూర్తి చేశారు.

తాజా సమాచారం ప్రకారం 'మిస్టర్ ఎక్స్' మూవీ రేపు అంటే గురువారం (మే 14) నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియోహాట్‌స్టార్' (Jio Hotstar) లో స్ట్రీమింగ్ కానుంది. కేవలం తమిళంలోనే కాకుండా, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ చిత...