భారతదేశం, సెప్టెంబర్ 12 -- OTT Thriller: తెలుగు డిజిటల్ వీక్షకులకు సస్పెన్స్ థ్రిల్లర్స్ అందించడంలో జీ5 (ZEE5) ఈ వారం టాప్ గేర్‌లో ముందుకు వెళ్తోంది. గతంలో 30 ఎపిసోడ్‌ల పాటు కొనసాగి విశేష ఆదరణ పొందిన డివోషనల్ అండ్ క్రైమ్ మిస్టరీ సిరీస్ 'వీరభద్రుని రహస్యం' సీజన్ 1 పార్ట్ 2 ప్రసారం ప్రారంభమైంది. పురాతన ఆలయ రహస్యాన్ని ఛేదించే క్రమంలో వచ్చే ఉత్కంఠభరిత ట్విస్టులు ఈ పార్ట్ 2 లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

వీరభద్రుని రహస్యం సీజన్ 1 పార్ట్ 2కు తోడుగా ప్రముఖ నటి ఉదయభాను నిర్మాణంలో, భరత్ శ్రీనివాస్ కథానాయకుడిగా నటించిన పవర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ వెబ్ సిరీస్ 'పంచనామా' జీ5 వేదికగా డిజిటల్ ప్రీమియర్ అయ్యింది. ఒక మరణం వెనుక దాగి ఉన్న పలు అనుమానాస్పద కోణాలను ఆవిష్కరించే కథాంశంతో ఈ సిరీస్ సస్పెన్స్ ప్రియులను ఆకట్టుకుంటోంది.

తెలుగు కంటెంట్‌కు కేరాఫ్ అడ...