భారతదేశం, మే 29 -- OTT Thriller: ఫ్రైడే వచ్చిందంటే ఓటీటీలో సందడి వేరే లెవల్ లో ఉంటుంది. ప్రతి శుక్రవారం కొత్త సినిమాల జోష్ తో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ కళకళలాడుతాయి. ఇవాళ కూడా చాలా సినిమాలే ఓటీటీ డెబ్యూ చేశాయి. ఇందులో ఈ రెండు థ్రిల్లర్లు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇందులో ఒకటి 'ఫేసెస్' కాగా.. మరొకటి 'సీట్ ఎడ్జ్'.

మలయాళ రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మూవీ 'ఫేసెస్'. థియేటర్లో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. శుక్రవారం (మే 29) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఫేసెస్ మూవీ అందుబాటులోకి వచ్చేసింది.

ఒరిజినల్ మలయాళ భాషలో తెరకెక్కిన 'ఫేసెస్' చిత్రం ఓటీటీలో మాత్రం తెలుగులోనూ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేసింది. ఈ సినిమా మలయాళంతో పాటు తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో సన్ న...