భారతదేశం, అక్టోబర్ 11 -- OTT Telugu Thriller: థియేటర్లలో విడుదలైనప్పుడు పెద్దగా పబ్లిసిటీకి నోచుకోలేకపోయిన మారెమ్మ మూవీ ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోంది. ఆహా వీడియో, జియోహాట్‌స్టార్‌ ఓటీటీల్లో ఈ మూవీ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇంత మంచి రూరల్ మైథలాజికల్ మిస్టరీ థ్రిల్లర్‌ను థియేటర్లలో ఎలా మిస్ అయ్యామని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో రివ్యూలు రాస్తున్నారు.

మారెమ్మ మూవీ ఇప్పుడు రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆహా వీడియో, జియోహాట్‌స్టార్‌లో ఓటీటీ ఆడియన్స్ ను ఈ మూవీ ఎంటర్ టైన్ చేస్తోంది. మాస్ మహారాజా రవితేజ సోదరుడు రఘు తనయుడు మాధవ్ భూపతిరాజు ఈ చిత్రంతో టాలీవుడ్‌ లో హీరోగా పరిచయమయ్యాడు. రస్టిక్ అండ్ ఇంటెన్స్ లుక్‌తో పల్లెటూరి యువకుడి పాత్రలో మాధవ్ ఆకట్టుకున్నాడు.

హీరోయిన్‌గా దీపా బాలు నటించగా, కీలక పాత్రల్లో వికాస్ వశిష్ట, సీనియర్ నటుడు విన...