భారతదేశం, జూన్ 16 -- OTT Telugu Thriller: టాలీవుడ్ లో కంటెంట్ బేస్డ్ సినిమాలతో తనదైన ముద్ర వేసిన దర్శకుడు చందు ముద్దు. 'రేపు ఉదయం పది గంటలకు' చిత్రంతో మెప్పించిన ఆయన.. ఇప్పుడు 'థాంక్యూ సుబ్బారావు' అనే సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు.

కె. రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో, కుర్రా ప్రొడక్షన్స్ బ్యానర్ పై దినేష్ కుర్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది.

తాజాగా విడుదలైన ట్రైలర్ ను గమనిస్తే.. ఈ సినిమా కేవలం ఒక ప్యూర్ ఫ్యామిలీ డ్రామా మాత్రమే కాదు, ఇందులో కామెడీ, యాక్షన్, రొమాన్స్ తో పాటు ఊహించని సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. లీడ్ పెయిర్ మధ్య సాగే లవ్ ట్రాక్ చాలా ఫ్రెష్ గా, యూత్‌ఫుల్‌గా అనిపిస్తుంది...