భారతదేశం, ఆగస్టు 15 -- OTT Telugu Crime Thriller: థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న డార్క్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'న్యూటన్స్ థర్డ్ లా' (Newton's 3rd Law) డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. రాజేష్ కర్ణ దర్శకత్వంలో సుమంత్, జగపతి బాబు, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది.

సుమంత్ లీడ్ రోల్ ప్లే చేసిన లేటెస్ట్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ 'న్యూటన్స్ థర్డ్ లా'. ఈ చిత్రం ఆగస్టు 27 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక 'ఈటీవీ విన్' (ETV Win) స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

"ప్రతి చర్యకూ దానికి సమానమైన, వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది" అనే భౌతిక శాస్త్ర నియమాన్ని (Newton's Third Law) మానవ ప్రవర్తనకు, నేర ప్రపంచానికి ముడిపెడుతూ దర్శకుడు రాజేష్ కర్ణ ఈ కథనాన్ని మలిచారు.

న్యూటన్స్ థర్డ్ లా స్టోరీ 1999 నాటి రెండు...