భారతదేశం, మార్చి 21 -- ఓటీటీలో తెలుగు సినిమాలు అదరగొడుతున్నాయి. ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన వాటిల్లో ఈ ఫిల్మ్స్ స్పెషల్ గా ఉన్నాయి. ఇందులో హారర్ థ్రిల్లర్ టు కామెడీ ఎంటర్ టైనర్ వరకు డిఫరెంట్ జోనర్లలో సినిమాలున్నాయి. ఈ వీకెండ్ కు వీటిపై ఓ లుక్కేయండి.

ఓటీటీలో తెలుగు హారర్ థ్రిల్లర్ 'అమరావతికి ఆహ్వానం' సినిమా అదరగొడుతోంది. ఈ సినిమా ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో శివ, ఎస్తేర్, ధన్య బాల‌కృష్ణ‌, సుప్రిత‌ తదితరులు నటించారు. దెయ్యాలను కెమెరాతో షూట్ చేద్దామని అమరావతి గ్రామానికి వెళ్లిన ఓ కుటుంబానికి ఏం జరిగిందన్నదే అమరావతికి ఆహ్వానం మూవీ స్టోరీ.

వరుస సినిమాలతో జోరుమీదున్న శ్రీ విష్ణు నుంచి వచ్చిన మరో మూవీ 'విష్ణు విన్యాసం'. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ విష్ణు విన్యాసం తెరకెక్కింది. ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో అయిదు భాషల్లో ...