భారతదేశం, ఏప్రిల్ 21 -- OTT Telugu: తెలుగు మూవీ యుఫోరియా ఓ ఓటీటీలోకి వచ్చిన మూడు వారాల తర్వాత రెండో ఓటీటీలోకీ రాబోతోంది. గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఇది. తన స్టైల్ కు పూర్తి భిన్నంగా ఓ సోషల్ ఎమోషనల్ డ్రామాను అతడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అయితే బాక్సాఫీస్ దగ్గర అంతగా సక్సెస్ సాధించలేదు.

భూమిక, సారా అర్జున్ లాంటి వాళ్లు నటించిన యుఫోరియా మూవీ ఇప్పుడు ఆహా వీడియో ఓటీటీలోకి కూడా రాబోతోంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ తన ఇన్‌స్టా అకౌంట్ ద్వారా వెల్లడించింది.

"మనసుకు గట్టిగా తగిలే యుఫోరియా ద ఫిల్మ్ ఆహా వీడియోలో ఏప్రిల్ 22 నుంచి స్ట్రీమింగ్.. యుఫోరియా.. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా" అనే క్యాప్షన్ తో స్ట్రీమింగ్ తేదీని వెల్లడించింది. ఇప్పటికీ ఈ మూవీ ఏప్రిల్ 2 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.

గు...