భారతదేశం, ఏప్రిల్ 21 -- OTT Telugu: ఓటీటీలోకి ఓ బోల్డ్ తెలుగు కామెడీ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. మార్చి 6న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా పేరు మెన్షన్ హౌస్ మల్లేష్ (Mansion House Mallesh). మగతనం నిరూపించుకుంటే భూమి వస్తుందని ఆశ పడే హీరో.. ఏం చేశాడన్నదే ఈ సినిమా కథ. ఐఎండీబీలో 8.6 రేటింగ్ ఉంది. ఆ వివరాలేంటో చూడండి.

తెలుగులో మరో భిన్నమైన కథతో వచ్చిన మూవీ ఈ మెన్షన్ హౌస్ మల్లేష్. మార్చి 6న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు సుమారు 50 రోజుల తర్వాత అంటే వచ్చే సోమవారం (ఏప్రిల్ 27) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది. "రెడీయా.. ఊర మాస్ స్టార్ అవుతోంది" అంటూ ఆ ఓటీటీ ఈ సినిమా స్ట్రీమింగ్ విషయం తెలిపింది.

శ్రీనాథ్ మాగంటి హీరోగా, బాల సతీష్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ 'మెన్షన్ హౌస్ మల్లేష్'. తండ్రి బాటలోనే తాగుడుకు బానిసైన ఒ...