భారతదేశం, ఆగస్టు 9 -- OTT Telugu: ఇటీవలి కాలంలో పెద్ద స్టార్ కాస్ట్, భారీ బడ్జెట్ లేకపోయినా కేవలం బలమైన కథ, ఆకట్టుకునే ఎమోషన్ ఉంటే తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని మరోసారి నిరూపితమైంది. 'ఆహా' (Aha Video) ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న 'దీవానా' (Deewana) చిత్రం అతి తక్కువ సమయంలోనే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ డిజిటల్ మైలురాయిని చేరుకుని ఓటీటీ ట్రెండింగ్ ఛార్ట్ లో అగ్రస్థానంలో నిలిచింది.

ప్యూర్ లవ్, యూత్‌ఫుల్ ఎమోషన్స్‌తో తెరకెక్కిన ఈ చిన్న సినిమా దీవానా ఓటీటీలో డిజిటల్ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అసలు ఈ సినిమాలో ఏముంది? ఆహాలో డిజిటల్ బ్లాక్‌బస్టర్‌గా మారిన ఈ చిత్రాన్ని మీరు ఎందుకు చూడాలి?

ప్రస్తుతం వస్తున్న రొటీన్ యాక్షన్, గ్యాంగ్‌స్టర్ సినిమాల మధ్య 'దీవానా' ఒక ఫ్రెష్ ఫీల్‌ను అందిస్తుంది. నిజమైన ప్రేమలోని స్వచ్ఛతను, న...