భారతదేశం, ఫిబ్రవరి 24 -- ఈవారం ఓటీటీల్లోకి ఓ ఇంట్రెస్టింగ్ తమిళ సినిమా తెలుగు వెర్షన్ కూడా రాబోతోంది. ఈ మూవీ పేరు హాట్ స్పాట్ 2 మచ్. రెండేళ్ల కిందట వచ్చిన హాట్ స్పాట్ సినిమాకు ఇది సీక్వెల్. అప్పట్లో తమిళ, తెలుగు వెర్షన్లు రెండూ ఒకేసారి వచ్చినా.. ఈసారి తమిళ వెర్షన్ కాస్త ముందుగా వచ్చింది. ఈ శుక్రవారం (ఫిబ్రవరి 27) తెలుగు వెర్షన్ రాబోతోంది.

తమిళ మూవీ హాట్ స్పాట్ 2 మచ్ గత వారమే ఒకటి రెండు కాదు ఏకంగా ఆరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి స్ట్రీమింగ్ కు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎందులోనూ తెలుగు వెర్షన్ రాకపోవడంతో ఇక్కడి ప్రేక్షకులు నిరాశ చెందారు. తాజాగా ఆహా వీడియో ఓటీటీ శుక్రవారం (ఫిబ్రవరి 27) నుంచి మూవీని తెలుగులో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది.

"మూడు బోల్డ్ స్టోరీలు.. ఒక ఆశయంతో సాగే డైరెక్టర్. మీరు ఊహించని రహస్యమైన ఎజెండా.. హాట్ స్పాట...