భారతదేశం, ఏప్రిల్ 3 -- శుక్రవారం వచ్చేసింది. డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓటీటీలో కొత్త సందడి కూడా వచ్చేసింది. ఇవాళ ఓటీటీలోకి ఓ తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ వచ్చేసింది. రీసెంట్ గా థియేటర్లలో నవ్వులతో పాటు సస్పెన్స్, థ్రిల్ అందించిన ఆ సినిమానే 'సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని'. ఈ మూవీ ఇవాళ ఓటీటీలో అడుగుపెట్టింది.

సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ఓటీటీ

తెలుగు లేటెస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ 'సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ఇవాళ (ఏప్రిల్ 3) ఓటీటీలోకి వచ్చేసింది. చాలా ఏళ్ల తర్వాత శివాజీ, లయ కలిసి నటించిన ఈ తెలుగు మూవీ డిజిటల్ డెబ్యూ చేసింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

ఓ శవాన్ని మాయం చేయాలనుకునేందుకు ట్రై చేసే ఫ్యామిలీ స్టోరీ ఇది. ఇందులో వచ్చే ట్విస్ట్ లు అదిరిపోతాయి.

Published by HT...