భారతదేశం, మార్చి 23 -- తెలుగు క్రైమ్ కామెడీ మూవీ సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. ఫిబ్రవరి 12న నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేద్దాం అనుకున్న ఈ తెలుగు సినిమా.. చివరి నిమిషంలో మనసు మార్చుకుని థియేటర్లలోకి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేయడానికి రెడీ అయిపోయింది. ప్రముఖ నటుడు శివాజీ, ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ మెయిన్ లీడ్స్‌గా నటించిన ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ మార్చి 26న ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

నిజానికి ఈ సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమాను ఈటీవీ విన్ కోసం ఒక ఓటీటీ ఒరిజినల్ ప్రాజెక్ట్‌గా ప్లాన్ చేశారు. కానీ సినిమా అవుట్‌పుట్ చాలా బాగా రావడంతో, మేకర్స్ తమ ప్లాన్ మార్చుకుని మార్చి 6న థియేటర్లలో రిలీజ్ చేశారు.

అక్కడ డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా.. కరెక్ట్‌గా ఇరవై రోజుల తర్వాత ఇప్పుడు ఓటీ...