భారతదేశం, ఫిబ్రవరి 9 -- తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు ఈవారం పండగే పండగ. ఫిబ్రవరి 7 నుంచి 13 మధ్యలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, యువ సంచలనం నవీన్ పోలిశెట్టి నటించిన భారీ సినిమాలు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. థియేటర్లలో అలరించిన ఈ సినిమాలు ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేయనున్నాయి. ఆ లిస్ట్, ప్లాట్‌ఫామ్ వివరాలు ఇక్కడ చూడండి.

ఈ వారం అంటే ఫిబ్రవరి 7 నుంచి 13 మధ్య తెలుగు ఓటీటీ స్పేస్ కళకళలాడనుంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్లుగా నిలిచిన సినిమాలు, డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌లతో వినోదం పంచడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు మిస్ కాకూడని ఆ చిత్రాల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఇంకా వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ...