భారతదేశం, సెప్టెంబర్ 4 -- OTT Telugu: సెప్టెంబర్ మొదటి వారంలో ఓటీటీ ఆడియన్స్‌కు వినోదాల విందు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్, ఆహా ప్లాట్‌ఫామ్‌లలో విభిన్న జానర్లకు చెందిన చిత్రాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. హారర్ కామెడీ 'కొరియన్ కనకరాజు', క్లాసికల్ మ్యూజికల్ డ్రామా 'జగమే సంగీతం', తెలంగాణ రూరల్ కామెడీ 'పళ్లబురుసు', సైకలాజికల్ థ్రిల్లర్ 'వదల'.. ఇలా ప్రతి ఒక్కరి అభిరుచికి తగ్గట్టుగా కంటెంట్ అందుబాటులోకి వచ్చింది.

కొరియన్ కల్చర్, లోకల్ ఎలిమెంట్స్‌ని మిక్స్ చేస్తూ రూపుదిద్దుకున్న డిఫరెంట్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. హారర్ ఎలిమెంట్స్‌తో పాటు కడుపుబ్బ నవ్వించే కామెడీ కోరుకునేవారికి నెట్‌ఫ్లిక్స్‌లో కొరియన్ కనకరాజు మంచి ఆప్షన్. వరుణ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ మూవీకి ఓటీటీలోనూ మంచి క్రేజ్ దక్కుతుం...