భారతదేశం, ఫిబ్రవరి 14 -- చిరంజీవి హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మన శంకర వర ప్రసాద్ గారు మూవీ నుంచి మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ వనవీర వరకు.. ఈ వీకెండ్ కు ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు తెలుగు సినిమాలు రెడీగా ఉన్నాయి. మరి ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన తెలుగు మూవీస్ పై ఓ లుక్కేయండి.

సంక్రాంతి 2026కు థియేటర్లలో అదరగొట్టిన 'మన శంకర వరప్రసాద్ గారు' ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన 24 గంటల్లోనే 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేసింది. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మన శంకర వర ప్రసాద్ గారు ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కుటుంబంతో కలిసి ఓటీటీలో మూవీ చూడాలనుకునేవాళ్లకు ఈ సినిమా బెస్ట్ ఛాయిస్.

నవీన్ పొలిశెట్టి కెరీర్ లోనే రూ.100 కోట్లు కొల్లగొట్టిన ఫస్ట్ మూవీ 'అన...