భారతదేశం, అక్టోబర్ 28 -- OTT Tamil Crime Thriller: ఓటీటీలో ప్రతి వారం వినూత్నమైన కాన్సెప్ట్‌లతో వచ్చే క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్లకు ఆడియెన్స్ నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో సాగే మూఢనమ్మకాలు, స్థానిక జానపద కథనాలు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ కలబోతగా వచ్చే సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అలాంటి కోవలోనే కోలీవుడ్‌లో సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదలై, విమర్శకుల ప్రశంసలు అందుకున్న తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ 'ది డార్క్ హెవెన్' (The Dark Heaven).

దర్శకుడు బాలాజీ స్వీయ రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు ఒకేసారి మూడు ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలకు సిద్ధమైంది. ఈ మిస్టరీ థ్రిల్లర్ ఒక మారుమూల గ్రామంలో ప్రతీ 7 ఏళ్లకు ఒకసారి జరిగే వింత చావుల బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది.

'ది డార్క్ హెవెన్' మూవీ స్టోరీ మొ...