భారతదేశం, జూలై 29 -- OTT Tamil: కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, బోల్డ్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి కాంబినేషన్‌లో వచ్చిన రూ. 55 కోట్ల బ్లాక్‌బస్టర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'గట్ట కుస్తీ 2' (Gatta Kusthi 2) డిజిటల్ ప్రిమియర్‌కి డేట్ లాక్ అయింది. థియేటర్లలో రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్లిన ఈ స్పోర్ట్స్ కామెడీ డ్రామా జులై 31 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ తమ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వెల్లడించడంతో సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఈ సినిమా జులై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. కేవలం మూడు వారాల్లోనే గ్లోబల్ వైడ్‌గా రూ. 55 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి విష్ణు విశాల్ కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రం...