భారతదేశం, సెప్టెంబర్ 12 -- OTT Series Review: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్లకు బాగా డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలోనే మరో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'పంచనామా' సిరీస్ డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఒకప్పటి యాంకర్, నటి ఉదయభాను ఈ సిరీస్ తోనే ప్రొడ్యూసర్ గా జర్నీ స్టార్ట్ చేయడం విశేషం. మరి ఈ 6 ఎపిసోడ్ల సిరీస్ అలరించిందా? లేదా? అన్నది రివ్యూలో చూసేద్దాం.

జైరామ్ (భరత్ శ్రీనివాస్) ఓ సీఐ. పోలీస్ డిపార్ట్ మెంట్ లో మంచి పేరు తెచ్చుకుంటాడు. అతనికి స్టూడెంట్ ఆది (చరణ్ బాబు) అంటే ఇష్టం. సొంత తమ్ముడు కాకపోయినా ఆదిని జైరామ్ చాలా ఇష్టంగా చూసుకుంటాడు. అయితే సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న ఆది హాస్టల్ లో చనిపోతాడు. అతని చావు చుట్టూ మిస్టరీ అల్లుకుంటుంది.

ఆది కేసును స్వయంగా సీఐ జైరామ్ ఎంక్వైరీ చేస్తుంటాడు. ఈ విచారణలో జైరామ్‌కు ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. ఆద...