భారతదేశం, జూన్ 23 -- OTT Series: భారతీయ డిజిటల్ స్క్రీన్స్ పై రూరల్ లైఫ్, లోకల్ పాలిటిక్స్, మిడిల్ క్లాస్ ఎమోషన్స్‌ను పండించడంలో టీవీఎఫ్ మార్క్ వేరే లెవెల్‌లో ఉంటుంది. భాత్కండి అనే ఒక మారుమూల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన 'గ్రామ్ చికిత్సాలయం' మొదటి సీజన్ మంచి విజయం సాధించింది. ఇప్పుడు అదే ఊపుతో మరింత పవర్‌ఫుల్ అండ్ ఫన్నీ కంటెంట్‌తో సీజన్ 2 ఇవాళ (జూన్ 23) ఓటీటీలోకి వచ్చేసింది.

ఓటీటీలోకి అదిరిపోయే వెబ్ సిరీస్ సీజన్ 2 వచ్చేసింది. మంగళవారం నుంచి గ్రామ్ చికిత్సాలయం సీజన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయింది.

గ్రామ్ చికిత్సాలయం సీజన్ 2 కథ విషయానికి వస్తే.. భాత్కండి గ్రామీణ ఆసుపత్రి రూపురేఖలను మార్చాలని, రోగులకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అం...