భారతదేశం, ఆగస్టు 28 -- OTT Movie Review: అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి శుక్రవారం (ఆగస్ట్ 28) ఎంట్రీ ఇచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'బబితా సింగ్ రిపోర్టింగ్' (Babita Singh Reporting) ఆడియన్స్ ను తొలి రోజే ఆకట్టుకుంటోంది. మలయాళ స్టార్ హీరోయిన్ నిమిష సజయన్, పాపులర్ నటుడు బరుణ్ సోబ్టి కాంబోలో వచ్చిన ఈ మూవీ ఓటీటీ లవర్స్ దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. మరి ఈ సినిమా స్టోరీ ఏంటి? ఎలా ఉందో ఈ రివ్యూలో చూడండి.

ఢిల్లీ క్రైమ్, దహాడ్, ఆర్యనాక్ లాంటి విమెన్ సెంట్రిక్ ఇన్వెస్టిగేటివ్ డ్రామాలు ఓటీటీలో ఇప్పటికే చాలానే వచ్చాయి. కానీ డైరెక్టర్ అంబికా పండిత్ తెరకెక్కించిన 'బబితా సింగ్ రిపోర్టింగ్' ఒక రియలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. బబిత అలియాస్ బేబీ (నిమిష సజయన్).. పోలీస్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న తన తండ్రి డ...