భారతదేశం, అక్టోబర్ 15 -- OTT Review: నిజాయతీకి ఓ పేదవాడు చెల్లించుకునే మూల్యం.. అతని పరువుకు ఈ దేశం ఇచ్చే విలువ.. ఈ వ్యవస్థలో న్యాయం కోసం ఓ డబ్బు లేని వాడు చేసే పోరాటం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించిన మూవీ ఎన్న విలై (Enna Vilai). ఈ తమిళ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో సంచలనం సృష్టిస్తోంది.

సాధారణంగా సముద్రంలో దొరికిన నిధి ఒక పేదవాడి జీవితాన్ని మారుస్తుందని అనుకుంటాం. కానీ ఆ బంగారమే అతని మెడకు ఉరితాడై, పోలీస్ వ్యవస్థ కుట్రలో బలిపశువును చేస్తే పరిస్థితి ఏంటి? రామేశ్వరం సముద్ర తీర నేపథ్యంలో తెరకెక్కిన భావోద్వేగపూరిత కోర్టు రూమ్ డ్రామా 'ఎన్న విలై' ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది.

'తొండిముత్త దృక్షాక్షితియుమ్' వంటి క్లాసిక్ థ్రిల్లర్‌కు కథ అందించిన జాతీయ అవార్డు గ్రహీత రచయిత సజీవ్ పళూర్ అందిం...