భారతదేశం, సెప్టెంబర్ 3 -- OTT Review: కిడ్నాప్ అయిన తన కూతురి కోసం కంటిచూపు కోల్పోయినా సరే ఒక తల్లి చేసే పోరాటమే 'గాంధారి' సినిమా. దేవాశిష్ మఖీజా డైరెక్షన్‌లో బాలీవుడ్ స్టార్ నటి తాప్సీ పన్ను లీడ్ రోల్‌లో నటించిన ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ రీసెంట్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ లోకి నేరుగా అడుగుపెట్టింది ఈ మూవీ. సీట్ ఎడ్జ్ యాక్షన్ సీక్వెన్సెస్‌తో మెప్పించిన ఈ సినిమా ఆడియన్స్‌కి ఆశించిన స్థాయిలో ఎమోషనల్ హై ఇచ్చిందా? లేదా అన్నది ఈ రివ్యూలో చూడండి.

జోయ్‌పురా ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా బాణి (తాప్సీ పన్ను) కళ్లముందే ఆమె చిన్నారి కూతురు కిడ్నాప్‌కి గురవుతుంది. కూతురిని కాపాడుకునే క్రమంలో జరిగిన ఒక ప్రమాదంలో బాణి తాత్కాలికంగా కంటిచూపు కోల్పోతుంది. పోలీసుల నుంచి ఎలాంటి సాయం లభించకపోవడంతో, తన భర్త (ఇష్వాక్ సింగ్)తో కలిసి బాణి ...