భారతదేశం, నవంబర్ 17 -- OTT Releases: ఓటీటీలోకి ఎప్పటిలాగే ఈవారం ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ రానుండగా.. వాటిలో తెలుగు, తమిళం నుంచి 5 క్రేజీ మూవీస్, సిరీస్ వాటిలో ఉన్నాయి. ముఖ్యంగా 'డీజే టిల్లు' దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కించిన 'అనుమాన పక్షి', ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తున్న 8.6 ఐఎండీబీ రేటింగ్ సాధించిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ '418' ప్రేక్షకుల్లో భారీ ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. మరి ఈ ఐదు చిత్రాల కథాంశాలు, నటీనటులు, స్ట్రీమింగ్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

ప్రదీప్ ఆంటోనీ, స్నేహా మణిమేగలై, సనమ్ శెట్టి, మగిళ్ తిరుమేని నటించిన ఈ వెబ్ సిరీస్ కు అబ్దుల్ కబీజ్ దర్శకత్వం వహించాడు. ఆఫీస్ రొమాంటిక్ కామెడీ జానర్ లో ఈ సిరీస్ జియోహాట్‌స్టార్ లోకి నవంబర్ 18న స్ట్రీమింగ్ కానుంది.

ఈ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే.. అరివ...