భారతదేశం, అక్టోబర్ 26 -- OTT Releases: ఈ వారం సౌత్ ఇండియాలో అదిరిపోయే కంటెంట్ ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ముఖ్యంగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'బత్తా' (Baththa) అక్టోబర్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఇది అందుబాటులో ఉంటుంది.

ఇక కీర్తి సురేష్, రాధికా ఆప్టే నటించిన లేడీ ఓరియంటెడ్ గ్యాంగ్‌స్టర్ సిరీస్ 'అక్క' (Akka) అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లోనే రాబోతోంది. 1980ల నాటి బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సిరీస్‌పై భారీ అంచనాలున్నాయి. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో కీర్తి సురేష్ నటించిన మరో రూరల్ డ్రామా 'డోరతీ' (Dorothy) ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతోంది.

తెలుగు టీనేజీ లవ్ అండ్ రొమాంటిక్ మూవీ తెల్ల కాగితాలు కూడా ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ అక్టోబర్ 29 నుంచి ఈటీవ...