భారతదేశం, నవంబర్ 17 -- OTT Release: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా 'ప్రేమద ఊరలి'. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా 2026 సెప్టెంబర్ లో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. స్టార్ కాస్ట్ లేకపోయినా, కేవలం కథాబలంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేలా చేసింది. థియేట్రికల్ రన్ లో కర్ణాటక వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఈ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ ఎట్టకేలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్ పైకి వచ్చేసింది.

అద్భుతమైన విలేజ్ ఫ్యామిలీ డ్రామా 'ప్రేమద ఊరలి' మూవీ ఇవాళ (నవంబర్ 17) పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో రిలీజైంది. మన తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో స్ట్రీమింగ్ అవుతోంది. అద్భుతమైన ఎమోషన్స్, కడుపుబ్...