భారతదేశం, మార్చి 2 -- రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా 'దేవగుడి' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. జనవరి 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. ఆశించిన స్థాయిలో ప్రమోషన్లు లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కులను సన్ నెక్స్ట్ (Sun NXT) దక్కించుకుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి. మంగళవారం (మార్చి 3) నుంచే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది.

బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన దేవగుడి సినిమా పూర్తిగా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగుతుంది. ఒక శక్తివంతమైన ఫ్యాక్షన్ కుటుంబం, వారి ప్రత్యర్థుల మధ్య జరిగే పోరాటమే ఈ మూవీ ప్రధానాంశం.

వీరారెడ్డికి అత్యంత నమ్మకస్తుడైన ధర్మ, ఆ కుటుంబాన్ని శత్రువుల నుండి ఎలా కాపాడాడు? రాఘవ రెడ్డితో ధర్మకు ఉన్న అనుబంధం ఎటువంటి మలుపులు తిరిగింది? అనే ఆసక్తి...