భారతదేశం, అక్టోబర్ 31 -- OTT Release: కుటుంబమంతా కలిసి కూర్చుని చూసే అచ్చమైన ఫ్యామిలీ సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ఎలాంటి అసభ్యకరమైన సన్నివేశాలు, మాటలు లేకుండా ఆహ్లాదకరంగా సాగే చిత్రాలను ఓటీటీ ఆడియన్స్ ఎగబడి చూస్తుంటారు. సరిగ్గా అలాంటి ఒక ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు పంకజ్ త్రిపాఠి, అదితి రావ్ హైదరి.

పంకజ్ త్రిపాఠి, అదితి రావ్ హైదరి కాంబినేషన్‌లో వస్తున్న సోనీ లివ్ (Sony LIV) ఒరిజినల్ మూవీనే 'పారివారిక్ మనురంజన్'. దీపావళి పండుగ వాతావరణం ముగిసిన వెంటనే, నవంబర్ 13న మీ కుటుంబ సమేతంగా కలిసి చూసేందుకు ఈ సినిమా సిద్ధంగా ఉందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఓటీటీలో ఈ సినిమా డైరెక్ట్ గా నవంబర్ 13న రిలీజ్ కానుంది.

విభిన్నమైన పాత్రలతో మెప్పించే పంకజ్ త్రిపాఠి.. తనదైన గ్లామర్, యాక్టింగ్ తో ఆకట్టుకునే అదితి...