భారతదేశం, అక్టోబర్ 13 -- OTT Release: నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా సరికొత్త సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ది ట్రాప్' (The Trap) ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయింది. ఇవాళ (అక్టోబర్ 13) ఈ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన Dear Child మేకర్స్ రూపొందించిన ఈ సిరీస్.. ప్రముఖ రచయిత్రి మెలానీ రాబే రాసిన బెస్ట్ సెల్లర్ నవల ఆధారంగా తెరకెక్కింది.

నెట్‌ఫ్లిక్స్‌లోని ది ట్రాప్ వెబ్ సిరీస్ సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సిరీస్ కథ లీసా కాన్రాడ్ అనే ప్రసిద్ధ రచయిత్రి చుట్టూ తిరుగుతుంది. పదేళ్ల క్రితం ఆమె కళ్ల ముందే సొంత సోదరి అన్నా దారుణ హత్యకు గురవుతుంది. ఆ భయంకరమైన గతాన్ని మర్చిపోలేక, అగోరాఫోబియాతో (Agoraphobia) బాధపడుతూ పదేళ్లుగా ఇంటి గడప దాటకుండా లీసా ఒంటరిగా జీవిస్తుంటుంది.

అయితే...