భారతదేశం, అక్టోబర్ 12 -- OTT Release: హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్‌ తెరకెక్కించిన మోస్ట్ అవేటెడ్ ఏలియన్ సై-ఫై థ్రిల్లర్ 'డిస్ క్లోజర్ డే' (Disclosure Day) డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన దాదాపు నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది.

థియేటర్లలో అదరగొట్టిన సైన్స్ ఫిక్షన్ మూవీ ఇండియాలో ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయింది. ఈ చిత్రం ఈ రోజు (అక్టోబర్ 12) నుంచే జియోహాట్‌స్టార్‌ పీకాక్ హబ్ (Peacock Hub) విభాగంలో ఇంగ్లీష్‌తో పాటు హిందీ డబ్బింగ్ వెర్షన్‌లోనూ సబ్‌స్క్రైబర్లందరికీ అందుబాటులోకి వచ్చింది.

1947 రోజ్‌వెల్ సంఘటన కాలం నుంచీ డెబ్బై ఏళ్లకు పైగా ప్రపంచ ప్రజలకు తెలియకుండా అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీ దాచిపెట్టిన ఏలియన్ల రహస్యాన్ని బట్టబయలు చేయడమే ఈ డిస్‌క్లోజ‌ర్ డే మూవీ స్టోరీ. సైబర్‌సెక...