భారతదేశం, అక్టోబర్ 14 -- OTT Release: కన్నడ డిజిటల్ స్క్రీన్‌పై సంచలనం సృష్టించిన బిగ్గెస్ట్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ 'అయ్యన మనే' (Ayyana Mane) ఇప్పుడు సరికొత్త మిస్టరీతో మన ముందుకు వస్తోంది. రమేష్ ఇందిరా దర్శకత్వంలో, శృతి నాయుడు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సిరీస్ సెకండ్ సీజన్ అక్టోబర్ 23, 2026 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ5 (ZEE5) ఓటీటీలో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది.

అయ్యన మనే వెబ్ సిరీస్ మొదటి సీజన్ మొత్తం ఆడియన్స్‌ను ఊపిరి బిగబట్టుకునేలా చేసింది. కథ విషయానికొస్తే.. జేజీ (ఖుషీ రవి) అనే యువతి దుష్యంత్ (అక్షయ్ నాయక) అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని 'అయ్యన మనే' అనే ఒక పురాతనమైన, రహస్యాలు దాగి ఉన్న పెద్ద ఇంట్లోకి అడుగుపెడుతుంది.

అయితే ఆ ఇంట్లోకి వచ్చిన ముగ్గురు కోడళ్లు అంతకుముందే వింత పరిస్థితుల్లో చనిపోయి ఉంటారు. జేజీ ఆ ఇంట్లో...