భారతదేశం, అక్టోబర్ 1 -- OTT Psychological Thriller: సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌లతో వచ్చే వెబ్ సిరీస్‌లకు ఓటీటీలో ఉండే క్రేజ్ వేరు. బాలీవుడ్ వెర్సటైల్ నటి కల్కి కొచ్లిన్, సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటించిన ఇంటెన్స్ డార్క్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'భ్రమ్' (Bhram) ప్రస్తుతం జీ5 (ZEE5) లో విపరీతమైన రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఒక్కో సీన్ వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్న ఈ 8 ఎపిసోడ్ల సిరీస్ థ్రిల్లర్ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తోంది.

ఈ వెబ్ సిరీస్ కథ అంతా ఆలీషా ఖన్నా (కల్కి కొచ్లిన్) అనే ఒక పాపులర్ నావెలిస్ట్ చుట్టూ తిరుగుతుంది. ఒక ఘోరమైన కార్ యాక్సిడెంట్‌లో తన భర్తతో పాటు కడుపులోని బిడ్డను కోల్పోయిన ఆలీషా.. తీవ్రమైన పోస్ట్ ట్రోమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD) బారిన పడుతుంది.

ఆ మానసిక వేదన నుంచి బయట...