భారతదేశం, మే 7 -- OTT Movies: ఓటీటీలోకి ప్రతి శుక్రవారంలాగే ఈ వారం కూడా ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రానున్నాయి. వీటిలో తెలుగు, మలయాళం భాషలకు చెందిన మూవీస్ కూడా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో వీటిని చూడొచ్చు. మరి అవేంటో చూడండి.

ఈ వారం ఓటీటీలో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న మూవీ అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'డెకాయిట్' (Dacoit). రాజస్థాన్ ఎడారి నేపథ్యంలో సాగే ఈ నియో-వెస్ట్రన్ యాక్షన్ డ్రామా మే 8 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. శేష్ తనదైన స్టైల్లో రివెంజ్ డ్రామాతో రాబోతుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అలాగే ప్రముఖ ర్యాపర్ 'కింగ్' నటుడిగా పరిచయమవుతున్న 'లుక్కే' (Lukkhe) వెబ్ సిరీస్ కూడా ప్రైమ్‌లోనే సందడి చేయనుంది.

మలయాళంలో బ్లాక్ బస్...