భారతదేశం, ఆగస్టు 13 -- OTT Malayalam Crime Thriller: ఓటీటీల వాడకం ఎక్కువయ్యాక ఇతర భాషల సినిమాలనూ తెలుగు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని మలయాళం, కన్నడ, తమిళం, హిందీ, ఇంగ్లీష్ సినిమాలను తెలుగులో డబ్ చేసి ఓటీటీ రిలీజ్ చేస్తున్నారు. ఇలా తెలుగులో డబ్ అయి వచ్చిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ 'ఉయిర్ (Uyir)' ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది.

మలయాళంలో రియల్ ఇన్సిడెంట్లతో జరిగిన స్టోరీని 'ఉయిర్' సినిమాగా తెరకెక్కించారు. ఈ స్టోరీని రియల్ పోలీస్ ఆఫీసర్ రాయడం విశేషం. థియేటర్లలో అదరగొట్టిన ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఆగస్టు 4న జియోహాట్‌స్టార్ (JioHotstar)లో రిలీజైంది. ఓటీటీలోకి వచ్చి సుమారు పది రోజులు అవుతున్నా ఈ మూవీ క్రేజ్ మాత్రం తగ్గలేదు.

ప్రస్తుతం ఓటీటీలో ఉయిర్ మూవీ సెన్సేషన్ గా మారింది. ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ను డిజిటల్ ఆడియన్స్ త...