భారతదేశం, జూన్ 9 -- OTT Malayalam: టాలీవుడ్ ప్రేక్షకుల్లో మలయాళ సినిమాలకు ఇప్పుడున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కంటెంట్ ఓరియెంటెడ్ కథలతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌ను సరికొత్తగా ప్రెజెంట్ చేయడంలో మాలీవుడ్ డైరెక్టర్లు ఎప్పుడూ ముందుంటారు. ఈ నేపథ్యంలో టోవినో థామస్, బేసిల్ జోసెఫ్, వినీత్ శ్రీనివాసన్ లాంటి క్రేజీ స్టార్స్ కాంబినేషన్ లో వచ్చిన సరికొత్త యాక్షన్ కామెడీ డ్రామా 'అతిరడి' (Athiradi) డిజిటల్ ప్రీమియర్‌కు రెడీ అయింది. ఐఎండీబీలో 7.7 రేటింగ్ సొంతం చేసుకున్న సినిమా ఇది.

మలయాళం మూవీ అతిరడి డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ (SonyLIV) సొంతం చేసుకుంది. జూన్ 19 నుంచి ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు సోనీ లివ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. రిలీజ్ కి ఇంకా కొన్ని రోజులే టైమ్ ఉండటంతో.. సోషల్ మీడియాలో సరికొత్త ప్...