భారతదేశం, ఆగస్టు 11 -- OTT Independence Day Movies: ఈ ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా దేశభక్తిని నరనరాల్లో నింపే 5 యథార్థ జీవిత కథల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలు ఓటీటీల్లో అలరిస్తున్నాయి. మన మాతృభూమి రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోల త్యాగాలను కళ్లముందు ఉంచే ఈ బయోపిక్స్ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తాయి. ఈ స్వాతంత్య్ర దినోత్సవం రోజున కుటుంబంతో కలిసి చూడాల్సిన ఆ టాప్ 5 రియల్ లైఫ్ మూవీస్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

1999 కార్గిల్ యుద్ధంలో శత్రుమూకలను చీల్చిచెండాడి అమరుడైన పరమ్ వీర్ చక్ర గ్రహీత కెప్టెన్ విక్రమ్ బత్రా నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'షేర్షా'. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తుంది.

2021లో కరోనా పరిస్థితుల వల్ల నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియ...