భారతదేశం, సెప్టెంబర్ 19 -- OTT Horror Thriller: టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎంఎస్ రాజు తెరకెక్కించిన డివైన్ మిస్టిక్ హారర్ థ్రిల్లర్ 'అగధ' (Agadha) ఓటీటీ ప్రయాణానికి ముహూర్తం ఖరారైంది. థియేటర్లలో ఆగస్టు 14న విడుదలై ఆకట్టుకున్న ఈ సూపర్ నేచురల్ హారర్ డ్రామా, సెప్టెంబర్ 25 నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5)లో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కాబోతోంది.

ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు.. గత కొంతకాలంగా దర్శకత్వంలోనూ తన ప్రత్యేక శైలిని చాటుకుంటున్నారు. 'డర్టీ హరి' వంటి డిఫరెంట్ ఎంటర్‌టైనర్ తర్వాత ఆయన కాన్సెప్ట్ ఓరియంటెడ్ జోనర్ ఎంచుకుని 'అగధ' చిత్రాన్ని రూపొందించారు.

"మంచికి చెడుకి మధ్య జరిగే ఒక భయంకరమైన యుద్ధమే ఈ అగధ" అంటూ జీ5 టీమ్ సోషల్ మీడియాలో పో...