భారతదేశం, సెప్టెంబర్ 11 -- OTT Horror Comedy: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చి డిజిటల్ ఆడియన్స్‌ను అలరిస్తోంది మలయాళ క్రేజీ హారర్ కామెడీ మూవీ 'మహారాజా హాస్టల్' (Maharaja Hostel). ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహా (aha) లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. యూత్‌ఫుల్ కాలేజ్ డ్రామా, భయపెట్టే దెయ్యం ఎలిమెంట్స్, కామెడీ కలగలిపి దర్శకుడు చారు వాకన్ ఈ సినిమాను రూపొందించారు.

ఇంజినీరింగ్ కాలేజ్‌లో జాయిన్ అయిన ముగ్గురు కుర్రాళ్లు అరవింద్ (అఖిల్ NRD), వర్కీ (అఖిల్ షా), మిథున్ (శరత్ బాబు) కథ ఇది. క్యాంపస్ లైఫ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేయాలని, నైట్ పార్టీలకు డబ్బులు దాచుకోవాలని ప్లాన్ వేస్తారు. అందుకే తక్కువ రెంట్‌కి దొరికే ప్రైవేట్ 'మహారాజా హాస్టల్' లో చేరతారు.

ఆ హాస్టల్‌కు బెత్తం పట్టుకుని తిరిగే ఎంజీఆర్ (సజిన్ చెరుకయిల్) వార్...