భారతదేశం, ఆగస్టు 12 -- OTT Horror: మలయాళం హారర్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలకు తెలుగు ఓటీటీ వీక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జూలై 3న థియేటర్లలో విడుదలై విమర్శకులు, సినీ ప్రియుల నుంచి విశేష ప్రశంసలు అందుకున్న సరికొత్త మలయాళ చిత్రం 'అరూపి' (Aroopi). థియేట్రికల్ రన్ విజయవంతంగా ముగించుకున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.

మలయాళం హారర్ థ్రిల్లర్ అరూపి ఆగస్టు 14, 2026 నుంచి డిజిటల్ వేదికలపై అందుబాటులోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థలు సంయుక్తంగా దక్కించుకున్నాయి. భారతదేశంలో ప్రైమ్ వీడియో, లయన్స్ గేట్ ప్లే, మనోరమా మ్యాక్స్, ఎపి ఇంటర్నేషనల్, ఆహా తమిళం ప్లాట్‌ఫామ్‌లలో ఈ మూవీ విడుదలవుతుండగా.. ఓవర్సీస్ ప్రేక్షకులకు సింప్లీ సౌత్ (Simply South) వేదికగా అందుబాటులోకి రాన...