భారతదేశం, ఫిబ్రవరి 27 -- ఇవాళ ఓటీటీలోకి భయపెట్టే ఓ హారర్ థ్రిల్లర్ వచ్చేసింది. ఒకే రోజు రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన ఆ తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమానే 'హనీ'. ఇందులో నవీన్ చంద్ర లీడ్ రోల్ ప్లే చేశాడు. కూతురితో క్షుద్రపూజలు చేసే సైకో తండ్రి కథ చుట్టూ హనీ మూవీ సాగుతుంది.

నవీన్ చంద్ర, దివ్య పిళ్లై జంటగా నటించిన తెలుగు హారర్ థ్రిల్లర్ 'హనీ'. ఈ డార్క్ హారర్ మూవీ ఇవాళ (ఫిబ్రవరి 27) ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు సన్ నెక్ట్స్ ఓటీటీల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రైమ్ వీడియోలోనేమో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా చూడొచ్చు. సన్ నెక్ట్స్ లో తెలుగు, తమిళంలో అందుబాటులో ఉంది.

హారర్ థ్రిల్లర్ హనీ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ఫిబ్రవరి 2, 2026న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్...