భారతదేశం, ఫిబ్రవరి 15 -- హాలీవుడ్ హారర్ థ్రిల్లర్లకు ఉండే క్రేజ్ వేరు. ఇక ఇందులోనూ పాపులర్ ఫ్రాంఛైజీ 'ది కంజురింగ్' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫ్రాంఛైజీలో వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను భయపెట్టాయి. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీలో చివరి సినిమాగా భావిస్తున్న 'ది కంజురింగ్ లాస్ట్ రైట్స్' కూడా థియేటర్లలో అదరగొట్టింది. ఇప్పుడు ఓటీటీలోనూ వణికిస్తోంది.

హాలీవుడ్ బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ 'ది కంజురింగ్ లాస్ట్ రైట్స్' మూవీ ఓటీటీలో సత్తాచాటుతోంది. వెన్నులో వణుకు పుట్టించే సీన్లతో సాగే ఈ సినిమా ఇప్పుడు జియోహాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉంది. తెలుగు ఆడియన్స్ మన భాషలోనూ ఈ కంజురింగ్ లాస్ట్ రైట్స్ చిత్రాన్ని ఎంజాయ్ చేయొచ్చు.

సెప్టెంబర్ 5, 2025న థియేటర్లలో రిలీ...