భారతదేశం, ఏప్రిల్ 4 -- అడవిలో ముసుగు వెనుకాల ఉన్న రాక్షసి అక్కడికి వచ్చిన జనాలను అత్యంత క్రూరంగా చంపుతుంది. కన్న తండ్రిని కూడా వదలదు. వెన్నులో వణుకు పుట్టించే ఈ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు.. 'డాలీ'. ఈ హాలీవుడ్ ఫిల్మ్ ఈ రోజు (ఏప్రిల్ 4) ఓటీటీలోకి వచ్చింది.

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ 'డాలీ' ఓటీటీలోకి వచ్చేసింది. శనివారం నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డాలీ సినిమా డిజిటల్ రిలీజ్ అయింది. అయితే ఈ మూవీని ఇప్పుడు రెంట్ పే చేసి మాత్రమే చూడొచ్చు. ప్రైమ్ వీడియో సబ్ స్క్రిప్షన్ ఉన్నప్పటికీ డాలీ సినిమా చూడాలంటే మనీ కట్టాల్సిందే.

హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ 'డాలీ' మూవీ తెలుగులోనూ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో చూడొచ్చు. ఒళ్లు గగుర్పొ...