భారతదేశం, నవంబర్ 4 -- OTT Free Movie: ఓటీటీ ఆడియన్స్ కు పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చింది. ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీని డైరెక్ట్ గా ఓటీటీ రిలీజ్ చేయడమే కాకుండా.. ఓటీటీ లవర్స్ కు ఫ్రీగా చూసే ఛాన్స్ కూడా కల్పించింది. ప్రియమణి, అర్జున్ రాంపాల ప్రధాన పాత్రల్లో నటించిన 'బ్లైండ్ గేమ్' ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది.

ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ 'బ్లైండ్ గేమ్' రిలీజైంది. థియేటర్లలో రిలీజ్ కాని ఈ మూవీ డైరెక్ట్ గా ఇవాళ (నవంబర్ 4) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. డిజిటల్ ఆడియన్స్ కు ఫ్రీగా సినిమాలు, సిరీస్ లు అందించడం కోసం జీ5 తీసుకొచ్చిన ఫ్రీ5 విభాగంలో ఈ క్రైమ్ థ్రిల్లర్ ను ఉచితంగా చూసేయొచ్చు.

బ్లైండ్ గేమ్ మూవీకి మరో స్పెషాలిటీ కూడా ఉంది. ఇది మలయాళ సూపర్ హిట్ సినిమా 'సెవెంత్ డే' కు హిందీ రీమేక్ కావడం విశేషం. 2014లో మలయ...