భారతదేశం, అక్టోబర్ 20 -- OTT Deal: దుల్కర్ సల్మాన్, దర్శకుడు పవన్ సాదినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఫీల్-గుడ్ డ్రామా 'ఆకాశంలో ఒక తార' (Aakasamlo Oka Tara) థియేట్రికల్ విడుదలకు ముందే బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం ఆల్-లాంగ్వేజ్ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకుందని తెలిసింది. కేవలం ఓటీటీ రైట్స్ ద్వారానే మూవీ బడ్జెట్ మొత్తం రికవర్ అయిపోవడం విశేషం.

ఇటీవల విడుదలైన 'ఆకాశంలో ఒక తార' టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సినిమాపై అంచనాలను పెంచేసింది. ఒక స్పూర్తిదాయకమైన జీవిత ప్రయాణాన్ని ఆవిష్కరించే కథాంశంతో వస్తున్న ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థల మధ్య గట్టి పోటీ నెలకొంది. చివరకు నెట్‌ఫ్లిక్స్ అన్ని భాషల (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ) స్ట్రీమింగ్ ...