భారతదేశం, అక్టోబర్ 6 -- OTT Crime Thriller: ఆటో డ్రైవర్‌గా ప్రయాణం మొదలుపెట్టి, మద్రాస్ క్రైమ్ రాజ్యాన్ని శాసించిన రియల్ సైకో కిల్లర్ కథే 'ఆటో శంకర్' (Auto Shankar). 1980ల నాటి భయానక ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రస్తుతం జీ5 (ZEE5) ఓటీటీలో దుమ్మురేపుతోంది.

ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లకు ప్రత్యేకమైన ఫాలోయింగ్, క్రేజ్ ఉంది. అందులోనూ రియల్ సైకో కిల్లర్ స్టోరీ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే జీ5 ఓటీటీలో ఉన్న ఈ ఆటో శంకర్ వెబ్ సిరీస్. అసలు ఈ సిరీస్ స్టోరీ ఏంటి? ఎందుకు చూడాలో తెలుసుకోండి.

పగటిపూట సాదాసీదా ఆటో నడిపే శంకర్ (అప్పాని శరత్), రాత్రి వేళల్లో సారా స్మగ్లింగ్ చేసేవాడు. ఆ క్రమంలో స్థానికంగా తనకు ఎదురొచ్చిన వాళ్లను తొక్కేస్తూ తన నేర సామ్రాజ్యాన్ని ఊహించని రేంజ్‌...