భారతదేశం, మే 13 -- OTT Bold: ప్రస్తుతం డిజిటల్ తెరపై నవలల ఆధారంగా రూపొందుతున్న వెబ్ సిరీస్‌లకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే 'ది సమ్మర్ ఐ టర్న్డ్ ప్రిటీ', 'మాక్స్టన్ హాల్', 'బ్రిడ్జర్టన్' వంటి సిరీస్‌లు గ్లోబల్ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అదే బాటలో ఇప్పుడు మరో ఆసక్తికరమైన రొమాంటిక్ అండ్ బోల్డ్ డ్రామా 'ఆఫ్ క్యాంపస్' (Off Campus) ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.

ప్రముఖ రచయిత్రి ఎల్ కెన్నెడీ రాసిన అత్యంత ప్రజాదరణ పొందిన 'ఆఫ్ క్యాంపస్' అనే నవలల సిరీస్ ఆధారంగా ఈ 'ఆఫ్ క్యాంపస్' అనే వెబ్ సిరీస్ ను రూపొందించారు. ఈ సిరీస్ సీజన్ 1 ఈ రోజు (మే 13) ఓటీటీలోకి వస్తుంది. ఇండియన్ టైమ్ ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ సీజన్ 1 అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది.

ఆఫ్ క్యాంపస్ సిరీస్ ట్రైలర్ చూస్తేనే దీన్ని ఎంత బోల్డ్ గా తెరకెక్కించార...