భారతదేశం, జూన్ 12 -- OTT Bold: ఫ్రైడే వచ్చిందంటే ఓటీటీలో జోష్ వేరే లెవల్ లో ఉంటుంది. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తాయి. అలా ఈ రోజు (జూన్ 12) రెండు డిఫరెంట్ మైండ్ బ్లోయింగ్ వెబ్ సిరీస్ లు ఓటీటీ బాట పట్టాయి. ఇవి రెండు డిఫరెంట్ జోనర్లలో తెరకెక్కాయి.

శుక్రవారం ఓటీటీలోకి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు 'రాఖ్'. ఈ హిందీ ఒరిజినల్ సిరీస్ తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. హిందీ, తెలుగుతో పాటు తమిళంలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో సీనియర్ హీరోయిన్ సోనాలి బింద్రే, 'మీర్జాపూర్' ఫేమ్ అలీ ఫజల్ కీలక పాత్రలు పోషించారు.

1970ల కాలంలో జరిగిన భయంకరమైన నేరాలు, వాటి వెనుక ఉన్న కథ ఆధారంగా రాఖ్ వెబ్ సిరీస్ తెరకెక్కింది. బాబు, రజ్జో అనే ఇద్దరు సైకో క్రిమినల్స్ చుట్టూ ఈ సిరీస్ స్టోరీ సాగుతోంది. వీళ్లు చే...